తిరుపతిలో మత్స్యదర్శిని

26 Feb, 2017 00:20 IST|Sakshi
తిరుపతిలో మత్స్యదర్శిని

►  జిల్లాకు మరో అరుదైన టూరిజం కేంద్రం  ఏర్పాటుకు స్థల సేకరణ
► నిర్మాణ పనులకు రూ.80 లక్షలు మంజూరు

తిరుపతి సెంట్రల్‌: ఆధ్యాత్మిక నగరవైున తిరుపతికి ఏపీ టూరిజం మరింత వన్నె తీసుకురానుంది. మొదటిసారిగా లక్షల రూపాయల వ్యయంతో అరుదైన మత్స్యదర్శినిని జిల్లా వాసులకు పరిచయం చేయనుంది. వైజాగ్‌ తరహాలో తిరుపతి నడిబొడు్డన వందల రకాల చేపల తో మత్స్యదర్శిని (రంగు రంగుల చేపలతో నిండిన ఆక్వేరియం) నిర్మించనుంది. సముద్రగర్భంలో మా త్రమే కనిపించే అరుదైన, అందవైున రంగురంగుల చేపలతో కూడిన సందర్శన కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ఏపీ టూరిజం నుంచి రూ.80 లక్షల నిధులను మంజూరు చేసింది.

ఈ ఆక్వేరి యం నిర్మాణ పనుల బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌ ఎడు్యకేషన్ వెల్ఫేర్‌ ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్   (ఏపీఈడబ్ల్యూఐడీసీ)కు అప్పగిస్తూ, అగ్రిమెంట్‌ కూడా చేసుకుంది. దీనికి సంబంధించి టెండర్లు కూడా పిలిచారు. చేపలను ఏర్పాటు చేసే బాధ్యతను మత్స్య శాఖ అధికారులకు అప్పగించారు. అంతా సవ్యంగా జరిగితే మరో ఆరు నెలల్లో తిరుపతికి వచ్చే యాత్రికులు, శ్రీవారి భకు్తలతో పాటు జిల్లా వాసులకు రంగురంగుల చేపలను సందర్శించే భాగ్యం కలుగుతుంది. విజయదశమిలోగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేలా టూరిజం అధికారులు కృషి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు