వడదెబ్బతో ఐదుగురు మృతి

1 Apr, 2017 21:56 IST|Sakshi
సాక్షి నెట్‌వర్క్‌: మండు ఎంతున్న ఎండలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన వారు వడదెబ్బతో మృత్యువాత పడుతున్నారు. శనివారం జిల్లాలో ఐదుగురు వడదెబ్బతో మృతి చెందారు. జిల్లాలో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బకు గురికాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎండకు బయటకు వెళ్లకూడదని..ఎండలో తిరగాల్సి వస్తే టోపీగాని, గొడుగుగాని ధరించాలని సూచిస్తున్నారు. ఎక్కువగా నీరు తాగాలని, చల్లని ప్రదేశంలో సేద తీరాలని చెబుతున్నారు. 
 
జిల్లాలో వడదెబ్బ మృతులు..    
పేరు(వయస్సు)        ఊరు మండలం                  కారణం
తొట్ల లక్ష్మమ్మ (69)  లద్దగిరి కోడుమూరు         పొలంలో చౌళకాయలు తెపేందుకు వెళ్లి
సిద్ధయ్య(31)           హాల్వి కౌతాళం              వ్యవసాయ పనులకు వెళ్లి..
వెంకటేశ్వర్లు(50)       బలపనూరు పాణ్యం        పొలం పనికి వెళ్లి..
బోయ కిష్టమ్మ(65)   చనుగొండ్ల గూడూరు         పొలం పనికి వెళ్లి..
వెంకటేశ్వరమ్మ(52)  తెర్నెకల్‌ దేవనకొండ          పొలం పనికి వెళ్లి..
 
మరిన్ని వార్తలు