ఐదడుగుల సొరకాయ

25 Nov, 2015 01:22 IST|Sakshi
ఐదడుగుల సొరకాయ

సొరకాయ మూమూలుగా ఒకటిన్నర అడుగు నుంచి రెండడుగుల పొడవు ఉంటుంది. మహా అంటే మూడడుగులు. కానీ వైఎస్‌ఆర్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం వెంకటగారిపల్లెకు చెందిన యువరైతు సామసాని వెంకటసుబ్బారెడ్డి తోటలో ఐదడుగుల సొరకాయలు కాశాయి. పెండ్లిమర్రి మండలం నందిమండలానికి చెందిన అభ్యుదయ రైతు నరసింహారెడ్డి ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన పంట ఉత్పత్తుల సందర్శనకు వెళ్లాడు. అక్కడ హర్యానా రాష్ట్రానికి చెందిన ఓ రైతు ఇచ్చిన సొర విత్తనాలను తీసుకువచ్చి వెంకటసుబ్బారెడ్డికి ఇచ్చాడు. తన పొలంలోని మునగ చెట్టు వద్ద వెంకట సుబ్బారెడ్డి ఆ విత్తనం నాటి తీగలను చెట్టుకు అల్లించాడు. ప్రస్తుతం ఐదు అడుగుల పొడవున్న నాలుగు కాయలు ఆ తీగలకు వేలాడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.                
- కడప అగ్రికల్చర్

మరిన్ని వార్తలు