సౌత్‌జోన్‌ దివ్యాంగుల క్రికెట్‌ జట్టుకు ఐదుగురి ఎంపిక

20 Mar, 2017 22:25 IST|Sakshi

సౌత్‌జోన్‌ దివ్యాంగుల క్రికెట్‌ జట్టుకు ఐదుగురు ఎంపికయినట్లు ఆంధ్రప్రదేశ్‌ దివ్యాంగుల క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మధుసూదన్‌నాయక్‌ తెలిపారు. వీరిలో అనంతపురం నుంచి సయ్యద్‌ నూరుల్‌ హుదా, రోశిరెడ్డి ఎంపికయ్యారన్నారు. వీరితోపాటు క్రాంతి (వైఎస్సార్‌ కడప), విజయ్‌(ప్రకాశం), సుబ్బారావు (ప్రకాశం)లు ఎంపికయ్యారన్నారు. జట్టుకు జిల్లాకు చెందిన సయ్యద్‌ నూరుల్‌ హుదా  కెప్టెన్‌గా వ్యవహరిస్తారన్నారు.

ఈ నెల 12 నుంచి 14 వరకు అనంతపురంలో జరిగిన సౌత్‌ ఇండియా క్రికెట్‌ టోర్నీలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను సౌత్‌జోన్‌ జట్టుకు ఎంపిక చేసినట్లు చెప్పారు.  ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 29 నుంచి ఏప్రిల్‌ 1 వరకు ముంబయ్‌లో జరిగే జాతీయ స్థాయి దివ్యాంగుల క్రికెట్‌ పోటీల్లో పాల్గొంటారన్నారు. రాష్ట్రం నుంచి ఐదుగురు ఎంపిక పట్ల రాష్ట్ర దివ్యాంగుల క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు మాంచో ఫెర్రర్, మధుసుధన్‌ నాయక్‌  హర్షం వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు