ఎనీ టైం మూత

19 Nov, 2016 01:04 IST|Sakshi
ఎనీ టైం మూత

ఐదు శాతమే పనిచేస్తున్న ఏటీఎంలు
కాసేపటికే ఖాళీ అవుతున్న నగదు
క్యూలో నిరాశచెందుతున్న ప్రజలు
మొబైల్ స్వైప్‌సేవలు ఒక్కపూటకే పరిమితం
వెంటాడుతున్న వంద నోట్ల కొరత

జిల్లావ్యాప్తంగా ఏటీఎంల పరిస్థితి దారుణంగా ఉంది. పెద్దనోట్ల రద్దు తర్వాత ఇవి ఉనికిని కోల్పోయే పరిస్థితి తలెత్తింది. కేవలం ఒకటీ అరా నామామాత్రంగానే పనిచేస్తున్నారుు. వంద నోట్ల కొరత ..సాంకేతికంగా అప్‌డేట్ కాకపోవడంతో అన్ని ఏటీఎంలు పనిచేయడమనేది ఇప్పట్లో సాధ్యం కాదేమోననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏటీఎంలు పనిచేయకపోవడంతో బ్యాంకులకు రద్దీ తగ్గడం లేదు.

తిరుపతి (అలిపిరి): నగదు లావాదేవీల్లో కీలక భూమిక పోషించాల్సిన ఏటీఎంలు నామమాత్రమైపోయారుు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇవి తలుపులు తెరుచుకోకపోవడంతో జనం నిరాశతో ఇంటిముఖం పడుతున్నారు. కొన్ని రోజులుగా ఇదే తంతు. తొలుత రెండు రోజులు తెరుచుకోవని కేంద్రం ప్రకటించింది. తర్వాత కూడా ఇవి అక్కడక్కడా తెరుచుకుంటున్నాయే తప్ప పూర్తి స్థారుులో సేవలందించడం లేదు. ఒకటీ అరా పనిచేసినా గంటల వ్యవధిలోనే వంద నోట్లు అరుుపోతున్నారుు. క్యూలో నిలబడిన వారు మర్నాడు కోసం ఎదురు చూడకతప్పడం లేదు. వంద నోట్ల కొరతతోపాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కాలేదని తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా 708 ఏటీఎంలు ఉంటే 5శాతం మాత్రమే పనిచేస్తున్నా రుు. శుక్రవారం సాయంత్రం ఒకటి రెండు పని చేసినా కొద్దిసేపటికే నో సర్వీస్ బోర్డులు వేలాడారుు. తిరుపతిలో ప్రారంభించిన మొబైల్ స్వైప్ సేవలపై కూడా ప్రజలు పెదవి విరుస్తున్నారు.

శుక్రవారం ఉదయం 5 మొబైల్ స్వైప్‌సేవలు(వాహనాలు) ప్రజలకు అందుబాటులో ఉంచారు. మధ్యాహ్నానికే నగదు ఖాళీ కావడం తో వాహనాలు మళ్లీ బ్యాంకుల ఎదుట కొలువుతీరారుు. మరోపక్క డిమాండ్ మేరకు బ్యాం కులు, పోస్టాఫీసులు సేవలు అందించడంలో విఫలమవుతున్నారుు. నగదు కొరతంటూ బ్యాంకులు చేతులెత్తాశారుు. పెద్ద నోట్లు రద్దై 11 రోజులు గడుస్తున్నా ఇంతవరకు బ్యాంకులు ప్రజా అవసరాలకు తగ్గుట్టుగా నదును పంపిణీ చేయలేకపోతున్నారుు. ఆర్బీఐ కొత్త నిబంధనలు కూడా ప్రజలకు మరింత కష్టాలు తెచ్చిపెట్టారుు. నగదు మార్పిడి  పరిమితిని రూ.4,500నుంచి రూ.2,000 కుదించడం ఇబ్బం ది కలిగించింది. బ్యాంకులు రూ.2వేల నోట్లు పంపిణీ చేస్తుండంతో ప్రజలు వాటిని చిల్లర నోట్లుగా మార్చుకోలేక తంటాలు పడుతున్నారు.

 రూ 2.8 వేల కోట్ల డిపాజిట్లు
నగదు కొరతతో ఇబ్బంది పడుతున్న తరుణంలోఆర్‌బీఐ ప్రకటన బ్యాంకులకు ఉపశమనం కలిగించింది. నగదు మార్పిడి పరిధిని రూ.4,500 నుంచి రూ.2వేలుకు కుదించింది. 40 జాతీయ బ్యాంకు శాఖలు, పోస్టాఫీసుల ద్వారా శుక్రవారం రూ.50 కోట్ల మేర నగదు మార్పిడి జరిగినట్లు జిల్లా లీడ్ బ్యాంక్ అధికారులు వెల్లడించారు. గత 9 రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో  రూ.2 వేల 80 కోట్ల మేర డిపాజిట్లు అందారుు.  రూ.250 కోట్ల మేర విత్‌డ్రాలు (ఆన్‌లైన్‌కాదు)జరిగారుు.

మరిన్ని వార్తలు