ఐదుగురు ఖైదీలు విడుదల

30 Mar, 2016 02:34 IST|Sakshi
ఐదుగురు ఖైదీలు విడుదల

ఇందులో ముగ్గురు జీవిత ఖైదీలు
సత్ప్రవర్తన కారణంగా శిక్ష నుంచి విముక్తి

 జిల్లా కారాగారం నుంచి మంగళవారం ఐదుగురు ఖైదీలను సత్ప్రవర్తన కారణంగా విడుదల చేశారు. వీరిలో ముగ్గురు జీవిత ఖైదీలు కాగా, ఇద్దరు ఏడాదిన్నర శిక్ష పడిన వారు ఉన్నారు.  - సంగారెడ్డి రూరల్

సంగారెడ్డి రూరల్: సత్ప్రవర్తన కారణంగా జిల్లా జైలు నుంచి మంగళవారం ఐదుగురు ఖైదీలు విడుదలయ్యారు. సత్ప్రవర్తన కారణంగా శిక్షా కాలానికి ముందే ప్రభుత్వం వీరిని విడుదల చేసింది. ఇందులో ముగ్గురు జీవిత ఖైదీలుండగా మరో ఇద్దరు ఏడాదిన్నర కాలం శిక్ష అనుభవించాల్సిన వారు ఉన్నారు. విడుదలైన వారిలో సంగారెడ్డి మండలం ఫసల్‌వాదికి చెందిన సి.మల్లప్ప 2006లో భార్యను హత్య చేసిన ఘటనలో శిక్షను అనుభవిస్తున్నాడు. తూప్రాన్‌కు చెందిన కె.భాస్కర్ ఆస్తి కోసం 2001లో తన తల్లిదండ్రులను హత్యచేయగా జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

న్యాల్‌కల్ మండలం తాటిపల్లికి చెందిన చాకలి నాగేష్ 2007లో తన భార్యను హత్య చేసిన నేరంపై జైలు పాలయ్యాడు. పటాన్‌చెరుకు చెందిన డి.రమేశ్, పటాన్‌చెరు మండలం క్యాసారం గ్రామానికి చెందిన మురళి... ఇతరుల ఆస్తులను ధ్వంసం చేసిన నేరంపై 2015 సెప్టెంబర్ నుంచి శిక్ష ను అనుభవిస్తున్నారు. పద్దెనిమిది నెలల శిక్షకు గాను సత్ప్రవర్తన కారణంగా వీరిని విడుదల చేసినట్టు జైలు సూపరింటెండెంట్ సంతోష్‌కుమార్‌రాయ్, జైలర్ చిరంజీవి తెలిపారు.

మరిన్ని వార్తలు