రోడ్డెక్కిన యుద్ధ విమానం

26 Feb, 2017 22:42 IST|Sakshi
వినువీధిలో దూసుకుపోతూ, శత్రులక్ష్యాలపై దాడి చేసే యుద్ధ విమానం జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ కనిపించింది. ప్రయాణించడం అంటే తనంతట తాను వెళ్లడం కాదు.. తానే మరో వాహనాన్ని ఆశ్రయించి గమ్యానికి వెళ్లడం. ఆదివారం గోవా నుంచి విశాఖపట్నానికి ట్రాలీపై తరలిస్తున్న యుద్ధ విమానం రావులపాలెం మండలం ఈతకోట వద్ద ‘సాక్షి’కి కనిపించింది. ముందు భాగంలో రాకెట్‌ తరహాలో ఉన్న ఈ యుద్ధ విమానాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ట్రాలీ డ్రైవర్‌ని అడిగితే ‘ఆర్మీ వినియోగించే విమానం’ అని మాత్రమే చెప్పాడు.  – -రావులపాలెం (కొత్తపేట) 
 
 
మరిన్ని వార్తలు