తగ్గుముఖం పట్టిన వరద

7 Aug, 2016 00:06 IST|Sakshi
తగ్గుముఖం పట్టిన వరద
కొవ్వూరు : గోదావరిలో వరద తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శనివారం సాయంత్రం 10.90 అడుగులకు చేరింది. దీంతో ఆనకట్టకి ఉన్న 175 గేట్లు మీటరు ఎత్తులేపి 4,69,190 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి  విడిచి పెడుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు 11,300 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. జిల్లాలో పశ్చిమ డెల్టా కాలువకి 5,500 క్యూసెక్కుల నీరు విడిచిపెడుతున్నారు. దీనిలో ఏలూరు కాలువకి 1,093, ఉండి కాలువకి 1,046, నరసాపురం కాలువకి 1,808, జీ అండ్‌ వీ కాలువకి 664, అత్తిలి కాలువకి 601 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు.
 
 
 
 
 
మరిన్ని వార్తలు