సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు

23 Sep, 2016 14:08 IST|Sakshi

సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు సుమారు 67,250 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా ప్రాజెక్టులోకి వస్తోంది. ప్రాజెక్టు నుంచి 117 క్యూసెక్కుల నీటిని బయటికి వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 21 టీఎంసీల నీరు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వసామర్ద్యం 30 టీఎంసీలు. ప్రాజెక్టులో నీటిమట్టం 521.8 మీటర్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 523.6 మీట్లరు.

 

మరిన్ని వార్తలు