ఏపీలో భారీగా వరద నష్టం

19 Nov, 2015 19:42 IST|Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో గత ఐదు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికీ పలు గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకుని ఉన్నాయి. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీనిపై విపత్తుల నిర్వహణ శాఖ నష్ట వివరాలను వెల్లడించింది. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సహాయక చర్యలు చేపట్టామని తెలిపింది. వరదలకు చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించింది. వరదలు, తుపానులు కారణంగా 3 వేల కోట్ల రూపాయలు నష్టం జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. నష్ట వివరాలు ఇలా ఉన్నాయి.

  • 35 మంది మృతి
  • 146 గ్రామాలు వర్ష ప్రభావానికి గురి
  • 467 ఇళ్లు పూర్తిగా, 2029 ఇళ్లు పాక్షికంగా ధ్వంసం
  • 613 జంతువులు మృతి
  • 1860 కి.మీల రహదారుల ధ్వంసం     
  • 2 లక్షల హెక్టార్లకు పైగా వ్యవసాయ, ఉద్యానవన పంటలకు నష్టం.

మరిన్ని వార్తలు