బోగస్‌ ఓటర్ల తొలగింపుపై దృష్టిసారించండి

6 Sep, 2016 23:03 IST|Sakshi
బోగస్‌ ఓటర్ల తొలగింపుపై దృష్టిసారించండి
 ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలకు జేసీ–2 రామస్వామి ఆదేశం 
కర్నూలు(అగ్రికల్చర్‌): బోగస్‌ ఓటర్లను గుర్తించి తొలగించడంపై ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు దృష్టిసారించాలని జాయింట్‌ కలెక్టర్‌–2 రామస్వామి తెలిపారు. డి–డూప్లికేట్‌ ఓటర్లు, ఒకే రకం ఫొటోతో రెండు,మూడు చోట్ల ఓటర్లుగా ఉన్న వారిని  తొలగించి  ఈఎస్‌ఐ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని  సూచించారు. మంగళవారం కలెకర్‌ సమావేశ మందిరంలో ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలకు ఈఎస్‌ఐ, ఈఆర్‌ఎంఎస్‌ వెబ్‌సైట్‌లో ఎలా పొందుపరచాలనే దానిపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...   జిల్లాలో డి–డూప్టికేట్‌ ఓటర్లు 82,581 మంది, ఒకే రకం ఫొటోతో రెండు,మూడు చోట్ల 14687 మంది, మల్టిపుల్‌ ఎర్రర్‌ ఓటర్లు దాదాపు 15వేల మంది ఉన్నారన్నారు.  పెండింగ్‌లో ఉన్న ఫారం–6,7,8,8ఎలపై విచారణ జరిపి ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో నిక్‌ టెక్నికల్‌ డైరక్టర్‌ నూర్జాహాన్,  శ్రీశైలం ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్‌ వెంకటసుబ్బారెడ్డి, ఆర్‌డీఓలు రుఘుబాబు, ఓబులేసు, సుధాకర్‌రెడ్డి, అన్ని నియోజక వర్గాల ఈఆర్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు