పర్యావరణ పరిరక్షణ కోసం..

14 Sep, 2016 22:33 IST|Sakshi
పర్యావరణ పరిరక్షణ కోసం..
నకిరేకల్‌ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లాలో ప్రపథమంగా నకిరేకల్‌లోని పన్నాలగూడెంలో ఎమ్మెల్యే వేముల వీరేశం క్యాంపు కార్యాలయం ఎదుట నెలకొల్పిన మట్టి వినాయక విగ్రహాన్ని బుధవారం రాత్రి మండపం వద్దే పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హీత నిమజ్జనం (నీళ్లతో కరిగించడం) చేశారు. నీళ్లతో అభిషేకాలు నిర్వహించారు. అయితే విగ్రహాలను నిమజ్జనానికి వేరే ప్రాంతాలకు తీసుకెళాల్లంటే ట్రాఫిక్‌ ఇబ్బందులతోపాటు చెరువుల్లో వేస్తే నీటి కాలుష్యం అవుతున్న నేప£ý ్యంలో నీటితో అభిషేకం చేసి కరిగించారు. కరిగించిన తరువాత మట్టిని భక్తులు తమ ఇళ్లకు తీసుకెళ్లడం గమనార్హం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలుగకుంఆ మట్టి విగ్రహాలను నెలకొల్పడం అభినందనీయమన్నారు. వచ్చే ఏడాది నియోజకవర్గ వ్యాప్తంగా మట్టి విగ్రహాలు నెలకొల్పేవిధంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రతినిధులు శ్రీనివాస్‌రావు, విద్యాసాగర్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, తిరుమలేశ, విగ్రహదాత పన్నాల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు  పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు