తల్లి కోసం.. ఒక్కటై

21 Aug, 2016 01:22 IST|Sakshi
తల్లి కోసం.. ఒక్కటై
శ్రీశైలం (జూపాడుబంగ్లా): కాశీ, గయా, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాలతోపాటు గోదావరి పుష్కర స్నానం అచరించిన 90 ఏళ్ల పిడూరు సుశీలమ్మ చివరిపర్యాయంగా కృష్ణాపుష్కరాలు చేసేందుకు కుటుంబసభ్యులతో శనివారం శ్రీశైలం తరలివచ్చారు. తల్లి చివరి కోరికను తీర్చేందుకు ఢిల్లీలో నివాసం ఉంటున్న ఆమె రెండో కుమార్తె పుష్పలత తోపాటు హైదరాబాదులో నివాసం ఉంటున్న పెద్దకుమార్తె సుబ్బారత్నం, మూడోకుమార్తె లత, నాలుగోవకుమార్తె వేదావతి, పెద్దకుమారుడు సుబ్బారావు, రెండోకొడుకు సుధాకర్‌లతోపాటు కృష్ణాపుష్కరస్నానం చేసేందుకు లింగాలగట్టు దిగువఘాటుకు చేరుకున్నారు. ఈసందర్భంగా వారిని ‘సాక్షి’పలకరించగా జన్మనిచ్చిన తల్లి కోర్కెను తీర్చేందుకు తాము శ్రీశైలంలో పుష్కరస్నానం చేసి స్వామివారిని దర్శించుకొనేందుకు వచ్చినట్లు తెలిపారు.     
 
మరిన్ని వార్తలు