రాజకీయ ప్రయోజనాల కోసమే విభజన

25 Aug, 2016 20:52 IST|Sakshi
మాట్లాడుతున్న రాంభూపాల్‌రెడ్డి
– వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండ్రెడ్డి రాంభూపాల్‌రెడ్డి
కొల్లాపూర్‌ : రాజకీయ ప్రయోజనాల కోసమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జిల్లాల ప్రకటన చేపట్టిందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండ్రెడ్డి రాంభూపాల్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన కొల్లాపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన విభజన ప్రక్రియ దుందుడుకు చర్యగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో విభజనపై ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. డివిజన్ల ప్రక్రియపై కనీస స్పష్టత లేదన్నారు. ఒకే నియోజకవర్గంలోని కొన్ని మండలాలు ఒక జిల్లాలో, మరికొన్ని మండలాల్లో ఇంకొన్ని జిల్లాల్లో ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు.
 
                                 ఒక జిల్లాకు చెందిన పోలీస్, జ్యుడీషియల్‌ డివిజన్లు మరో జిల్లాలో ఉన్నాయన్నారు. వీటన్నింటినీ సరిదిద్దకుండానే జిల్లాల విభజన చేపట్టడం పరిపాలన సౌలభ్యం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. జిల్లాల విభజనకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం కాదని, అయితే డివిజన్ల ప్రక్రియను, నియోజకవర్గ సమస్యలన్నీ పరిష్కరించిన తర్వాత ఒక జిల్లా వ్యవహారాలకు మరో జిల్లాతో సంబంధం లేకుండా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన కోరారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
 
 
మరిన్ని వార్తలు