రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి

24 Jul, 2016 22:25 IST|Sakshi
రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి
 
– పీసీసీ అధ్యక్షుడు రఘువీరాకు కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వల్లంరెడ్డి వినతి
 
ఒంగోలు టూటౌన్‌ :  జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వల్లంరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు ఎన్‌. రఘువీరారెడ్డికి ఆదివారం వినతి పత్రం ఇచ్చారు. పొగాకు పంట విరమించే రైతులకు రూ.10 లక్షల వరకు బ్యారన్‌కు ప్రకటించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. సుబాబుల్, జామాయిల్, యూకలిప్టస్‌ తదితర సామాజిక వనాల రైతులకు గిట్టుబాటు ధర, కొనుగోలు సొమ్ము గ్యారంటీ కోసం ఏపీ పేపరు బోర్డును ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించారు. మిరప విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.   నకిలీ విత్తనాలు అమ్మిన కంపెనీని బ్లాక్‌ లిస్టులో పెట్టించాలన్నారు. ఎస్‌ఎన్‌ పాడు ఇన్‌చార్జి వేమా శ్రీనివాసరావు, మార్కాపురం ఇన్‌చార్జి షేక్‌సైదా,  శ్రీనివాసరావు, రసూల్, బొడ్డు సతీష్, కొప్పొలు సుబ్బారావు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు