రైతులు సమస్యలు పరిష్కరించాలి

10 Aug, 2016 23:55 IST|Sakshi
కావలిరూరల్‌ : దేశానికి అన్నంపెట్టే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలని రైతుసంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి సీఎస్‌ఆర్‌ కోటిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన కావలిలో విలేకరులతో మాట్లాడుతూ ప్రకతివిపత్తుల సమయంలో పంటనష్టపోయిన రైతులకు ప్రభుత్వాలు కంటితుడుపుగా నష్టపరిహారాలు చెల్లిస్తున్నాయన్నారు. దీంతో చాలామంది గిట్టుబాటు ధరలు లేక, అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడన్నారు. పిల్లల చదువులకోసం భూములను అమ్ముకొని పట్టణాలకు వలసలు వెల్లి అక్కడ కూలీలుగా మారుతున్నారన్నారు. పంటలకు, రైతులకు, పశువులకు, వ్యవసాయ యంత్రాలకు, పనిముట్లకు ఉచితబీమాను అందించాలన్నారు. రైతులకు నష్టం వాటిలినప్పుడు శాటిలైట్‌ ద్వారా నష్టాన్ని అంచనా వేసి 30 రోజులలోపు వారిబ్యాంకు ఖాతాలలో పరహారం జమచేయాలన్నారు. 60 సంవత్సరాలు దాటిన ప్రతి రైతుకు పెన్షన్‌ ఇవ్వాలి.  
 
 
మరిన్ని వార్తలు