వరి సాగు వైపే మొగ్గు

11 Jul, 2016 09:34 IST|Sakshi
-బోర్లు, బావుల ఆధారంగా సాగు
-ఆశాజనకంగా లేని భూగర్భజలాలు
-సాగర్ ప్రాజెక్ట్ నిండితేనే ఆయకట్టుకు నీరు
-వేచి చూడాలంటున్న అధికారులు
-తప్పనిసరి పరిస్థితుల్లో వరి సాగు
హుజూర్‌నగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఎడమ కాల్వ పరిధిలోని ఆయకట్టులో గల నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో పలువురు రైతులు ఖరీఫ్ వరి సాగుకు సిద్ధమవుతున్నారు. బోర్లు, బావుల ఆధారంగా కొంతమేర నీటి ల భ్యత కలిగిన రైతులు కో టి ఆశలతో సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఇటీవల కురిసిన తొలకరి వర్షాలకు రైతులు తమ బీడు భూము ల్లో సేంద్రియ ఎరువుల విత్తనాలైన జీలుగ, పెసర సాగు చేపట్టారు. అంతేగాక బీడు భూముల ను దున్నడంతో పాటు వరి పెంచుతున్నారు.

నిరాశాజనకంగా భూగర్భజలాలు
ప్రస్తుతం బోర్లు, బావుల్లో ఆశించిన మేర భూగర్భజలాలు లేకపోవడంతో నారుమళ్లకు మాత్రమే సదరు నీరు సరిపోతుందని రైతు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తరుచుగా వర్షాలు పడుతున్నందున చెరువులు, కుంటల్లోకి నీరు చేరడంతో పాటు భూ గర్భ జలాలు పెరుగుతాయని ఆశాభావంతో సాగు పనుల్లో నిమగ్నమయ్యూరు.

గత రబీ సీజన్‌లో కూడా బోర్లు, బావుల ఆధారంగా సాగు చేపట్టిన రైతులు అడుగంటిన భూగర్భ జలాలతో వరిపొలాలకు సాగు నీరందక ఎండిపోవడంతో తీవ్ర నష్టాలపాలయ్యూరు. అయినప్పటికీ వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులు అనేక ఆశలతో ఖరీఫ్ వరి సాగుకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా ఇప్పటికే సుమారు 20 వేల ఎకరాలకు పైగా రైతులు వరినార్లు పోసి పెంచుతూ సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.


సాగర్ నిండితేనే సాగునీరు
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 503 అడుగుల అడుగంటిన నీరు ఉండటం, ఆ పైన గల శ్రీ శైలం, జూరాల, నారాయణపూర్ ప్రాజెక్ట్‌లకు కూడా నేటి వరకూ నీరు చేరకపోవడంతో అవి అడుగంటారుు. ఈ ప్రాజెక్ట్‌లన్నీ నిండి చివరగా ఉన్న సాగర్ ప్రాజెక్ట్‌లోకి నీరు చేరితేనే ఆయకట్టుకు సాగునీరందే అవకాశం ఉంది. సాగునీరు వస్తుందో రాదో తెలియని పరిస్థితుల్లో సైతం రైతులు వరి సాగు చేపడుతుండడం చర్చనీయాంశంగా మారింది.
 
మరిన్ని వార్తలు