నిధులొచ్చాయి.. నొక్కేయడమే తరువాయి..

1 Jan, 2017 22:51 IST|Sakshi
  • ఎత్తిపోతల పధకాల నిర్మాణం పేరిట నిధుల దోపిడి
  • కాంట్రాక్టర్లు, అధికారుల ఇష్టారాజ్యం
  • నూతన నిర్మాణం కన్నా మరమ్మత్తులకే అధిక కేటాయింపులు
  • కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం
  • ఐటిడిఎ డిఆర్‌డిఏ సంయుక్త నిధులు గంగలో పోసిన పన్నీరే
  • వృధాగా ప్రవహించే కొండ వాగుల నీటిని మెట్టభూముల వైపు మళ్లిద్దామనే లక్ష్యంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు కాంట్రాక్టర్లు,అధికారులకు కల్పతరువులుగా మారాయి. కోట్లు వ్యయం చేసినా  ఒక్క ఎకరం భూమికి నీరివ్వలేకపోగా అధికారులు కాంట్రాక్టర్లు మాత్రం జేబులు నింపుకొంటున్నారు. 1992 నుంచి మొదలైన ఈ దోపిడీ కథ మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నీటిపారుదల రంగానికి నిధులు విడుదల చేయడంతో ఏఓపీఎస్‌ఐడీసీ) అధికారులు ‘రంగం’లోకి దిగి పనులు ‘చక్కబెడుతున్నారు’. అడ్డతీగల మండలం వీరవరం వద్ద 1995 కాలంలో నిర్మించిన ఎత్తిపోతల పథకానికి మళ్లీ మరమ్మతులు మొదలుపెట్టారు.                     –   అడ్డతీగల
     
    రూ.26.68 లక్షలు  ఏమైనట్టో..!
    గతంలో 20 మంది రైతులకు చెందిన 50 ఎకరాలకు నీరిస్తామని చెప్పి రూ.25.25 లక్షల అంచనాతో పనులు మొదలుపెట్టి పూర్తిచేసే నాటికి రూ.26.68 లక్షలు ఖర్చయినట్టు పేర్కొన్నారు. ఇందులో 75 శాతం ఐటీyీ ఏ, 25 శాతం డీఆర్‌డీఏ విడుదల చేసింది. కానీ నిర్మాణం పూర్తి అయినా కనీసం ఒక్క పంటకు కూడా చుక్కనీరు ఇవ్వలేని స్థితిలో ఆ పథకం మూలనపడింది. 1995లో ఓమారు ఈపధకాన్ని పరిశీలించిన అధికారులు. ఇ¯ŒSటెక్‌ వెల్‌ పాడవ్వడంతో పాటు నీటిని అందించే సంప్‌ వద్ద మరమ్మత్తులు చెయ్యాలని అప్పట్లోనే చెప్పారు. వీటి పంపుసెట్, సర్వీస్‌లై¯ŒSలు,ప్యూజ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం విద్యుత్‌ సరఫరా అవసరని ఐటిడిఏ అధికారులకు వివరించి ఇప్పటికి ఆరు సార్లు మరమ్మతులు చేశారు కానీ ప్రయోజనం శూన్యం. ఇప్పుడు తాజాగా రూ.55 లక్షల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. ఆ ఎత్తిపోతల పథకం వద్ద పాత పైప్‌లై¯ŒS అలా ఉండగానే కొత్త పైప్‌లై¯ŒS పనులను చురుగ్గా చేసేస్తున్నారు. ప«థకం నిర్మాణం కన్నా మరమ్మతులకు రెండింతలు నిధులు కేటాయించేటట్లు చక్రంతిప్పిన అధికారులు నీటిని తోడే మోటార్లను వెలికితీసి బయట పడేయడం గమనార్హం.
    నిధుల విడుదలంతా గోప్యం.. 
    రంపచోడవరం డివిజ¯ŒSలో 800 ఎకరాలు సాగులోనికి తీసుకురావడానికి 27 చోట్ల ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. అడ్డతీగల మండలంలోని 1992–96 కాలంలో పింజిరికొండ, పణుకురాతిపాలెం, రావిగూడెం, పైడిపుట్ట, ఉప్పలపాడు, మట్లపాడు, చాకిరేవుల, సరంపేట, వీరవరం, ధాన్యంపాలెం గ్రామాల్లో ఆయా కొండ వాగుల చెంతనే రూ.1.5 కోట్ల అంచనాలతో రూ.1.3 కోట్లు వ్యయం చేసి పథకాలు నిర్మించారు. గంగవరం మండలంలో మోహనాపురం, శరభవరం, నూగుమామిడి, కరకపాడు వంటిచోట్ల రూ.27.64 లక్షలు అంచనాలతో రూ.25.328 లక్షలు వ్యయంచేసి ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. ఏ పనులు చేపట్టినా రాజమండ్రి నుంచి వీలున్నప్పుడల్లా ఏఈ వచ్చి జరుగుతున్న పనులను చూసివెళ్తుండడంలో పర్యవేక్షణలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మరిన్ని చోట్ల ఆయా పథకాల వద్ద మరమ్మతులు చేపట్టడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. కాగా వీరవరం ఎత్తిపోతల పథకం వద్ద మరమ్మతుల మాయాజాలంపై సంబంధిత ఏఈ మూర్తి వివరణ కోరడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు.
     
    ఏవిధమైన సమాచారం ఇవ్వడం లేదు
    వీరవరం ఎత్తిపోతల పథకం పనులు ఇటీవలే చేపట్టారు. పాత పైప్‌లై¯ŒS ఉండగానే కొత్త పైప్‌లై¯ŒS వేస్తున్నారు. అసలు ఏమేరకు నిధులు విడుదల అయ్యాయి, ఏం పనులు చేస్తారు అని అడిగినా ఇంజినీరింగ్‌ అధికారులు కనీసం సమాధానం కూడా చెప్పడం లేదు. గతంలో ఇలాగే పలుమార్లు తూతూమాత్రపు పనులు చేపట్టి వెళ్లిపోయారు. నిధుల ఖర్చు చూపుతున్నారు తప్పించి ప్రయోజనం లేదు.
    – జనుమూరి నాగేశ్వర్రావు, వీరవరం సర్పంచ్‌
     
    ఎన్నోసార్లు పనులు చేశారు నీరు రాలేదు
    నాకు 3 ఎకరాల భూమి ఉంది. ఎత్తిపోతల పథకం పనిచేస్తే నీరొస్తొందని చాలాకాలం నుంచి చూస్తున్నాను. ఇప్పటికీ ఎన్నోసార్లు పనులు చేశారు. నీరు మాత్రం రాలేదు. నీరొస్తుందని ఆశ కూడా లేదు. ఇప్పుడు మళ్లీ పనులు చేస్తున్నారు. ఏమవుతుందో చూడాలి.
    – జర్తా హరిచంద్రారెడ్డి, వీరవరం రైతు
     
    పనులు చేస్తున్నారు నీరొస్తుందని అనుకుంటున్నాం
    ఎత్తిపోతల పథకం వద్ద పనులు చేస్తున్నారు. కొత్త పైప్‌లై¯ŒS వేస్తున్నారు. పథకం నిర్మించినప్పటి నుంచి పంటలకు నీరు రాలేదు. దీంతో వర్షాధారంతోనే 2 ఎకరాల భూమి సాగు చేసుకుంటున్నాను. రైతులు ఈ పథకం గురించి ఆశక్తి చూపడం లేదు.
     
    – చెదలలక్ష్మయ్య రైతు,వీరవరం
     
మరిన్ని వార్తలు