కృష్ణా నదిలో నలుగురు యువకులు గల్లంతు

22 Apr, 2016 08:34 IST|Sakshi

కృష్ణా జిల్లా కోడూరు మండలం విశ్వనాథపల్లి వద్ద శుక్రవారం ఉదయం కృష్ణా నదిలో మునిగి నలుగురు బాలురు గల్లంతయ్యారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు ..  గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన కొందరు కుటుంబాలతో కలసి శుక్రవారం విశ్వనాథపల్లిలోని అద్దంకి నాంచారమ్మను దర్శించుకునేందుకు ఆలయం వద్దకు వచ్చారు.

వారంతా సమీపంలోని కృష్ణా నదిలో స్నానాలు చేసేందుకు వెళ్లారు. అయితే, నీళ్ల లోతు తెలియక లోపలికి దిగిన మైలా నాంచారయ్య కుమారుడు జయకృష్ణ(18), తోలుసూరి బాలయ్య కుమారుడు నాగరాజు(14), ఆరజాల శ్రీను కుమారుడు శ్రీకాంత్(16), ముత్తిపల్లి నాంచారయ్య కుమారుడు పవన్‌కుమార్(16) మునిగిపోయారు. కొద్దిసేపటి తర్వాత గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. రెవెన్యూ, పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని మత్స్యకారుల సాయంతో వారి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు