హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు

10 Sep, 2016 01:59 IST|Sakshi

భువనగిరి అర్బన్‌  
 హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ భువనగిరి అదనపు సెషన్స్‌ జడ్జి సిపి.విందేశ్వరి శుక్రవారం తీర్పు చెప్పినట్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పూలిమామిడి శశిధర్‌రెడ్డి తెలిపారు. వివరాలు..  భూతగాదాల నేపథ్యంలో 2012వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో పోచంపల్లి మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన గంగదేవి పర్వతాలు దారుణహత్యకు గురయ్యాడు.  ఈ కేసులో అదే గ్రామానికి చెందిన ముంత మల్లయ్య, ఇడమోని నర్సింహ, ఉప్పునూతల నర్సింహ, లక్ష్మయ్య, మేకల యాదయ్య, గంగదేవి చంద్రయ్య, కంటి బుచ్చయ్య, మేకల పర్వతాలు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసుల విచారణలో తేలింది. అప్పటి పోచంపల్లి ఎస్‌ఐ అర్జునయ్య నిందితులపై కేసు నమోదు చేశారు. తదనంతరం చౌటుప్పల్‌ సీఐ తిరుపతన్న  నేర అభియోగపత్రాలను కోర్టులో దాఖలు చేశారు. సాక్షులను విచారించిన అనంతరం ముంత మల్లయ్య, ఇడమోని నర్సింహ, ఉప్పునూతల నర్సింహ, లక్ష్మయ్యపై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు, రూ.10 జరిమానా విధించినట్లు తెలిపారు.  
 

>
మరిన్ని వార్తలు