బ్యాంకు పేరుతో 5లక్షలు దోచేశారు

21 May, 2016 10:04 IST|Sakshi
బ్యాంకు పేరుతో 5లక్షలు దోచేశారు

రూ.4.90లక్షలు ఖాతా నుంచి మళ్లింపు
ఖమ్మం : బ్యాంక్ ఆఫ్ పాటియాలతో రూ.4.90లక్షలకు  కుచ్చుటోపీ పెట్టిన సంఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకోంది. టూ టౌన్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. విజయ్‌నగర్ కాలనీకి చెందిన పోల్లు సత్యనారాయణకు మూడు అంతస్తుల భవనం ఉంది. పై అంతస్తులో ఆయన నివాసం ఉంటుండగా కింద ఫోర్షన్ ఖాళీగా ఉంది. గురువారం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తాము బ్యాంక్ ఆప్ పాటియాల ఉద్యోగులమని, మీ ఇంట్లో తమ బ్యాంక్ పెట్టాలని అనుకుంటున్నామని సత్యనారాయణను నమ్మించారు.

చదరపు మీటర్ రూ.40 చొప్పున అద్దె మాట్లాడుకున్నారు. అప్లికేషన్ ఫాంకు సంబంధించి మొత్తం రెండు చెక్కులు ఇవ్వాలని, ఒక చెక్కుపై రూ.200, మరోచెక్కుపై రూ.2,500 ఇవ్వాలన్నారు. సత్యనారాయణ ఆయన భార్య పేరు మీద సిండికేట్ బ్యాంక్ చెక్కులు రెండు ఇచ్చాడు. శుక్రవారం ఖాతా నుంచి రూ.4.90లక్షలు డ్రా అయినట్లు మేసేజ్ వచ్చింది. వెంటనే ఆయన బ్యాంక్‌కు వెళ్లి ఆరా తీయగా ఢీల్లీలో సందీప్‌కుమార్ సింగ్ ఖాతాకు మళ్లింపు చేసారని సిండికేట్ బ్యాంక్ అధికారులు చెప్పారు. వెంటనే సత్యనారాయణ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సీఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు