భయపెట్టిన ముసురు

27 Jan, 2017 00:57 IST|Sakshi
కోవెలకుంట్ల:
పంట ఉత్పత్తులు చేతికందే తరుణంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని ముసురు పట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గురువారం సాయంత్రం జిల్లాలో పలు ప్రాంతాల్లో జల్లులు కురిశాయి.  ఇదే సమయంలో పలు చోట్ల పంట నూర్పిళ్లు జరుగుతున్నాయి. దీంతో పంట ఉత్పత్తులు వర్షానికి తడిచి నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందారు. కోవెలకుంట్ల డివిజన్‌లో మిరప, కంది, జొన్న, పప్పుశనగ, మినుము, తదితర పంటల కోతలు, నూర్పిడి పనులు జరుగుతుండగా వడ్లు, మిరప దిగుబడులను కల్లాలు, పొలాల్లో ఆరబోసుకున్నారు. ఈ తరుణంలో అకాల వర్షంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. దిగుబడులు తడవకుండా పట్టలు కప్పుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. ఒక మోస్తారు వర్షం కురిసినా దిగుబడులు తడిచిపోయి తీరని నష్టం సంభవిస్తుందని రైతులు దిగాలు చెందుతున్నారు.    
మరిన్ని వార్తలు