టైలరింగ్, బ్యూటీషన్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ

30 Aug, 2016 00:27 IST|Sakshi
మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ :  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, కేంద్ర గ్రామీణాభివద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రామీణ నిరుపేద మహిళలకు టైలరింగ్, బ్యూటీషన్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ జి.లక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. 30 రోజులపాటు ఉచిత భోజనం, వసతి, వ్యక్తిత్వ వికాసం, వ్యాపార నిర్వహణలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం ధ్రువపత్రాలు అందజేయనున్నట్లు వివరించారు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు ఆధార్, రేషన్‌ కార్డు, జిరాక్స్‌లతో పాటు 5 పాస్‌పోర్టు సైజు ఫొటోలతో సెప్టెంబర్‌ 1వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 08542–270395, 9963369361 నెంబర్లను సంప్రదించాలని కోరారు.
మరిన్ని వార్తలు