23 నుంచి ఉచిత పశువైద్య శిబిరాలు

21 Jul, 2016 22:46 IST|Sakshi
  • కోరుట్ల పశువైద్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహణ 
  • 29 వరకు రోజుకు రెండు గ్రామాల్లో సేవలు
  • జగిత్యాల అగ్రికల్చర్‌ : ఎన్‌ఎస్‌ఎస్‌లో భాగంగా కోరుట్ల పశువైద్య కళాశాలలో ఆధ్వర్యంలో జగిత్యాల డివిజన్‌లోని పలు గ్రామాల్లో ఈ నెల 23 నుంచి 29 వరకు ఉచిత పశు వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్లు కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ టి.రఘునందన్, ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ డి.కృష్ణ తెలిపారు. ఈ శిబిరాలను ఉదయం 7.30 గంటలకు ప్రారంభిస్తామని చెప్పారు. వ్యాధుల బారిన పడిన పశువులకు చికిత్స చేయడం, పశువుల్లో గర్భకోశ వ్యాధులకు చికిత్స–నిర్ధారణ, చూలు నిర్ధారణ పరీక్షలు, దూడలకు నట్టల నివారణ మందులు వేయడం, వ్యాధి నిరోధక టీకాలు వేయడం, పశు పోషణ–సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించడం, పశుగ్రాసాలపై చైతన్యం చేయడం వంటి తదితర కార్యాక్రమాలు ఉంటాయని వివరించారు.  
    కార్యక్రమాల నిర్వహణ..
    ఈ నెల 23న వెల్గటూర్‌ మండలంలోని పాత గూడూరు, ముంజంపల్లి గ్రామాలలో, 24న మల్యాల మండలంలోని మ్యాడంపెల్లి, తాటిపల్లి గ్రామాలలో, 25న పెగడపల్లి మండలంలోని రాములపల్లి, మద్దులపల్లి గ్రామాల్లో, 26న గొల్లపల్లి మండలంలోని రాఘవపట్నం, లోత్తునూర్‌ గ్రామాల్లో, 27న ధర్మపురి మండలంలోని సిరికొండ, బీర్‌సాని, 28న జగిత్యాల మండలంలోని తాటిపల్లి, రాయికల్‌ మండలంలోని ఇటిక్యాల గ్రామాలు, 29న జగిత్యాల మండలంలోని హబ్సీపూర్, గుట్రాజ్‌పల్లి గ్రామాల్లో వైద్య శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిబిరాల్లో కోర్సు చివరి సంవత్సరం విద్యార్థులతోపాటు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, పశుసంవర్థక శాఖ అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు.  
మరిన్ని వార్తలు