సామాజిక ఇంజినీర్లుగా ఎదగాలి

2 Sep, 2016 00:52 IST|Sakshi

జేఎన్‌టీయూ : ఇంజినీరింగ్‌ పూర్తయిన ప్రతి ఒక్కరూ దేశ పురోగతికి దోహదపడి, సామాజిక ఇంజినీర్లుగా ఖ్యాతి దక్కించుకోవాలని జేఎన్‌టీయూ వీసీ ఆచార్య ఎం.సర్కార్‌ పేర్కొన్నారు. గురువారం జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్‌ కళాశాలలోని ఆడిటోరియంలో ఫ్రెషర్స్‌ డే ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వీసీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఎప్పటికప్పుడు నూతన అంశాలపై అధ్యయ నం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.  క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరచిన వారికి బహుమతులు అందచేశారు.   జేఎన్‌టీయూ రెక్టార్‌ ఆచార్య పాండురంగడు, రిజిస్ట్రార్‌ ఆచార్య కృష్ణయ్య, ప్రిన్సిపల్‌ ఆచార్య బి. ప్రహ్లాదరావు, వైస్‌ ప్రిన్సిపల్‌ ఆచార్య ఎంఎల్‌ఎస్‌ దేవకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు