ఫ్రెండ్లీ పోలీస్‌ విధాన అమలు

14 Dec, 2016 23:49 IST|Sakshi
ఫ్రెండ్లీ పోలీస్‌ విధాన అమలు
  • కావలి డీఎస్పీ కార్యాలయంలో నూతన చాంబర్‌ ప్రారంభోత్సవంలో ఎస్పీ
  • కావలిరూరల్‌ : జిల్లాలో ఫ్రెండ్లీ పోలీస్‌ విధానాన్ని అమలు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ అన్నారు. బుధవారం ఆయన కావలి పట్టణంలో పర్యటించారు. ఈసందర్భంగా డీఎస్పీ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన డీఎస్పీ చాంబర్‌ను ప్రారంభించారు. అనంతరం విజిటర్స్‌బుక్‌లో తన సందేశాన్ని రాశారు. తర్వాత ఒకటో టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన రిసెప్షన్‌ కేంద్రం, గార్డెనింగ్‌లను ప్రారంభించారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చే ఫిర్యాదుదారులను రిసెప్షన్‌లో ఽస్థిమితంగా కూర్చోబెట్టి స్నేహపూరిత వాతావరణంలో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఫ్రెండ్లీ పోలీస్‌లో భాగంగా స్టేషన్లను ఆధునీకరించి వసతులు కల్పిస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా అడిషనల్‌ ఎస్పీ శరత్‌బాబు, కావలి ఆర్డీఓ లక్ష్మీనరసింహం, డీఎస్పీ ఎస్‌.రాఘవరావు, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది, పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు. 
    పోలీసు కుటుంబాల కలయిక:
     డీఎస్పీ కార్యాలయంలో పోలీసు కుటుంబాలతో గెట్‌ టూ గెదర్‌ ఏర్పాటుచేశారు. ఈకార్యక్రమంలో ఎస్పీ సతీమణితోబాటు డీఎస్పీ, సీఐలు, ఎస్సైలు, వారి కుటుంభసభ్యులతో కలిసి హాజరయ్యారు. దీంతో అక్కడ పండుగ వాతావారణం నెలకొంది.
     
     
మరిన్ని వార్తలు