క్రీడలతో స్నేహ సంబంధాలు

24 Sep, 2016 23:25 IST|Sakshi
క్రీడలతో స్నేహ సంబంధాలు
– జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ
కల్లూరు: క్రీడలతో స్నేహ సంబంధాలు మెరుగుపడతాయని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. శనివారం నగరంలోని డీఎస్‌ఏ అవుట్‌డోర్‌ స్టేడియం ఆవరణలో రాష్ట్ర స్థాయి టెన్నీస్‌ వాలీబాల్‌ బాలబాలికల పోటీలను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌లో మహిళలు రాణించి పతకాలు సాధించారని, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. నిరంతర సాధన చేస్తే విజయాలు సొంతమవుతాయన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని చాటాలని డీవీఈఓ సుబ్రమణేశ్వర్, ఆర్‌ఐఓ పరమేశ్వరరెడ్డిఅన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో టెన్నీస్‌ వాలీబాల్‌ క్రీడను అభివృద్ధి చేస్తామని  టెన్నీస్‌ వాలీబాల్‌ సంఘం చైర్మన్‌ జోసఫ్‌జాయ్‌ పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్‌యార్డు చైర్‌పర్సన్‌ శమంతకమణి, గొర్రెల పెంపకందారుల సంఘం జిల్లా చైర్మన్‌ నాగేశ్వరరావు యాదవ్, డిప్యూటీ ఈఓ వెంకటరావు, ఒలింపిక్‌ సంఘం కార్యదర్శి సి. రామాంజనేయులు, టెన్నీస్‌ వాలీబాల్‌ సంఘం అధ్యక్షుడు సత్రం రామకష్ణుడు, రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావ్, బీసీమహిళా సంఘం అద్యక్షులు పార్వతమ్మ, పోటీల నిర్వాహక కార్యదర్శులు చలపతిరావు, ఈశ్వర్‌ పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు