25 నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌

23 Jul, 2016 23:34 IST|Sakshi
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఐసెట్‌–2016కు కౌన్సెలింగ్‌ను ఈ నెల 25 నుంచి ఎస్‌జీపీఆర్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహిస్తామని కోఆర్డినేటర్‌ వై.విజయభాష్కర్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 25 నుంచి 29వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమవుతుందన్నారు. జూలై 28 నుంచి 30వ తేదీ వరకు కళాశాలలకు ఆప్షన్లు, ఆగస్టు రెండో తేదీ కళాశాలల కేటాయింపు ప్రక్రియ ఉంటుందన్నారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.500, బీసీ/ఓసీ విద్యార్థులు రూ.1000  చెల్లించాలన్నారు. ఎన్‌సీసీ/పీహెచ్‌సీ/క్యాప్‌/స్పోర్ట్స్‌ కేటగిరీ వారికి  విజయవాడ బెంజ్‌ సర్కిల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు. ఐసెట్‌–2006 హాల్‌టికెట్, ర్యాంకు కార్డు, ఆధార్‌కార్డు, పది, ఇంటర్, డిగ్రీ మార్కుల జాబితాలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, 9 నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్ల ఒరిజినల్స్, రెండు సెట్ల జిరాక్స్‌ ప్రతులతో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ (www.apicet.nic.in) లో చూడాలన్నారు. 
 
మరిన్ని వార్తలు