నేటి నుంచి శ్రీమద్భాగవత సప్తాహ వేడుకలు

22 Aug, 2016 00:43 IST|Sakshi
ఏర్పాట్లు చేస్తున్న అలయ సిబ్బంది

 

  • చిత్రకూట మండపంలో ప్రత్యేక కార్యక్రమాలు
  • ఘనంగా ఏర్పాట్లు చేసిన అధికారులు

భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి 29 వరకు శ్రీ మద్భాగవత సప్తాహ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి  సోమవారం సాయంత్రం అంకురారోపణ చేయనున్నారు.  22న సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉత్సవానుజ్ఞ, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనము, బుత్విక్‌వరణము, అంకురారోపణము, వాస్తుహోమము, మండపారాధనము. 23న ఆరాధన, సేవాకాలం, శాత్తుమొరై, శ్రీమద్భాగవతం 1 స్కందము నుంచి 3 స్కందములో 20వ అధ్యాయం వరకు పారాయణము. 24న శ్రీమద్భాగవతం  23వ అధ్యాయం వరకు పారాయణము, 25న 5వ స్కందము 24వ అధ్యాయం నుంచి 7వ స్కందము పూర్తి పారాయణం, 26న శ్రీకృష్ణ జయంతి ఉదయం 6 నుంచి 7.30 వరకు ఆరాధన, సేవాకాలం, శాత్తుమొరై. ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు గోపూజ, చతుఃస్థానార్చన, దశమస్కంధ హోమము, 8,9 స్కందములు పూర్తి పారాయణము, 27న 10వ స్కందములో 42వ అధ్యాయం వరకు పారాయణము, 28న 10వ స్కందములో 43వ అధ్యాయం నుంచి పూర్తి పారాయణము, 29న 11, 12 స్కందముల పారాయణము, మహా పూర్ణాహుతి, వేద విన్నపములు.
 

మరిన్ని వార్తలు