రాజకీయ శిక్షణా తరగతులు

22 Jul, 2016 00:13 IST|Sakshi
రాజకీయ శిక్షణా తరగతులు

చిలుకూరు: అఖిల భారత విద్యార్థి సంఘం రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక రాజకీయ శిక్షణా తరగతులు ఈ నెల 26 నుంచి 28 వరకు  మూడు రోజుల పాటు యాదగిరిగుట్టలో  జరుగుతాయని విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు చేపూరి కొండలు తెలిపారు. బుధవారం చిలుకూరు సీపీఐ భవన్‌లో శిక్షణా తరగతుల కరపత్రంను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. విద్యార్థులను చైతన్యం చేసేందుకు శిక్షణా తరగుతులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. శిక్షణా తరగతుల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో  తమ్మనబోయని నరేష్, క్రాంతి,  కె. సతీశ్, వీరబాబు, శివ, సురేష్, సతీశ్, గోపి, నరేష్, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.l
 

మరిన్ని వార్తలు