జోరందుకున్న వరి నాట్లు

3 Aug, 2016 16:51 IST|Sakshi
జోరందుకున్న వరి నాట్లు

రోజూ వర్షాలు కురియడం.. చెరువుల్లో పుష్కలంగా నీరు చేరడంతో రైతన్నలు వరి నాటుపై ఆసక్తి చుపుతున్నారు. గతేడాది సుమారు 100 ఎకరాల్లో వరి సాగు చేయగా.. ఈ ఏడాది సుమారు 300 ఎకరాలకు పైగా సాగవుతున్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. ఏళ్ల తరబడి సాగుకు నోచుకోని బీడు భూములను కూడా రైతన్నలు సాగులోకి తెస్తున్నారు. మండలంలోని పెద్దేముల్‌, దుగ్గాపూర్‌, మంబాపూర్‌, జనగాం, గాజీపూర్‌, బుద్దారం, కందనెల్లితండా, తింసాన్‌పల్లి తదితర గ్రామాల్లో వరి నాట్లు వేయడం జోరందుకుంది. దానికి తోడు కులీలకు డిమాండ్‌ కూడా పెరింగిందని రైతులు అంటున్నారు.  - పెద్దేముల్‌

>
మరిన్ని వార్తలు