నిధి మూలుగుతుంది

27 Jul, 2016 23:14 IST|Sakshi
నిధి మూలుగుతుంది
  1. వేసవిలోయుద్ధప్రాతిపదికన తాగునీటి పనులు
  2. నిధులు మాత్రం మంజూరు లేదు
  3. కలెక్టరేట్‌లో మూలుగుతున్న సొమ్ము
  4. గుర్రుమంటోన్నప్రజాప్రతినిధులు
  5. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:వేసవి జల సంక్షోభం నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం నా¯ŒS సీఆర్‌ఎఫ్‌ నిధుల కింద జిల్లాకు రూ.27 కోట్లు కేటాయించిం ది. ఈ నిధులను ఉపయోగించి మంచినీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన కొత్త బోర్లు డ్రిల్లింగ్, పైప్‌లైన్లు, వాటర్‌ ట్యాంకుల మరమ్మతులు, కొ త్త ట్యాంకుల నిర్మాణం చేపట్టవ చ్చు. ఈ ఏడాది సింగూరు ఎండిపోవడంతో దాదాపు 1939 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. 457 గ్రామాల్లో అయితే మరీ తీవ్రమైంది. జలగం డం నుంచి తప్పించుకునేందుకు ప్రతి నియోజకవర్గానికి రూ.2 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు మార్చి, ఏప్రిల్, మేలో నా¯ŒS సీఆర్‌ఎఫ్‌ నిధులతో ఎక్కడికక్కడ బోరుబావులు తవ్వారు. వాటికి సింగిల్‌ ఫేజ్‌ మోటార్లు బిగించి, వందల సంఖ్యలో ట్యాంకర్లు ఏర్పాటుచేశారు. మొత్తానికి తాగునీటి సమస్యను తీర్చారు.
    మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు
    వేసవి తాపం నుంచి గట్టెక్కడానికి ఎమ్మెల్యేలు తమ పరిధిలోని గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీలు, ఇతర చిన్నపాటి కాంట్రాక్టర్లతో డబ్బులు ఖర్చుపెట్టించారు. నామినేటెడ్‌ పద్ధతిలో నా¯ŒS సీఆర్‌ఎఫ్‌ పథకం కింద

    గ్రామీణస్థాయి ప్రజా ప్రతినిధులు తమ గ్రామాల్లో బోర్లు వేయించారు. వాటర్‌ ట్యాంకర్లు అద్దెకు తీసుకొని వినియోగించారు. ప్రతి నియోజకవర్గంలో సగటున రూ.70 లక్షల నుంచి రూ.కోటికి పైగా ఖర్చు చేశారు. సిద్దిపేట డివిజ¯ŒS పరిధిలో 906 పనులు చేపట్టారు. రూ.14.37 కోట్ల ప్రతిపాదనలు పంపారు. వీటిలో ఈ ఏడాది వేసవిలో రూ.8.9 కోట్లు ఖర్చు చేశారు. 

    దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక, దౌల్తాబాద్, చేగుం ట, మిరుదొడ్డి, మండలాSల్లో రూ.1.50 కోట్లు ఖర్చు చేశారు. మెదక్‌ నియోజకవర్గంలోని మెదక్, రామాయంపేట, పాపన్నపేట, చిన్నశంకరంపేట మండలాల్లో గడచిన వేసవిలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షలు ఖర్చు చేశారు. కానీ, ఇప్పటికీ నిధు లు మంజూరు కాలేదు. అందోలు నియోజకవర్గంలో అందోలు, పుల్క ల్, అల్లాదుర్గం, రేగోడ్, మునిపల్లి, రాయికోడ్, టేక్మాల్‌ మండలాలు వస్తాయి. 

    2015–16 సంవత్సరం కింద నా¯ŒS సీఆర్‌ఎఫ్‌ నిధులు 294 పనులకు రూ.2 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో రూ.1.47 కోట్లు ఖర్చు పెట్టారు.తీవ్ర గడ్డు పరిస్థితి ఎదుర్కొన్న నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో ప్రతి మండలానికి రూ.30 లక్షల చొప్పున ఖర్చు చేసి ప్రతి గ్రామంలో బోరుబావితో పాటు సింగిల్‌ ఫేజ్‌ విద్యుత్తు మోటార్లు బిగించారు. పైప్‌లై¯ŒS పనులు పూర్తిచేశారు. కానీ, నిధులు రాలేదు.
    నిధులు పుష్కలం
    నా¯ŒS సీఆర్‌ఎఫ్‌ నిధులు ఎప్పుడో వచ్చాయి. సుమారు రూ.27 కోట్లు కలెక్టర్‌ ట్రెజరీలో మూలుగుతున్నాయి. అయినా, ఇప్పటి వరకు నిధుల పం పిణీ జరగలేదు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల నుంచి సేకరిం చిన సమాచారం ప్రకారం.. నా¯ŒS సీఆర్‌ఎఫ్‌ పనుల కింద చేపట్టిన పనుల నివేదికను వేసవి కాలం చివరలోనే కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌కు నివేదించారు. అప్పటి నుంచి నివేదిక కలెక్టర్‌ వద్దే పెండింగ్‌లో ఉందని చెప్తున్నారు.
    ప్రజాప్రతినిధుల ఆగ్రహం
    పనులు పూర్తి చేసినా నెలల తరబడి నా¯ŒSసీఆర్‌ఎఫ్‌ నిధులు విడుదల చేయకపోవటంతో పలు నియోజకవర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధులున్నా చేసిన పనులకు డబ్బు ఇవ్వకుండా కాలయాపన చేయటంపై అభ్యంతరం తెలుపుతున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ఇచ్చిన నివేదికలో ఏమైనా లోపాలు ఉంటే పునర్విచారణ జరిపించాలని, అధికారుల మీద నమ్మకం లేకపోతే థర్డ్‌ పార్టీతో సర్వే చేయించాలని కోరుతున్నారు. వేసవి అనంతరం పంపిన ప్రతిపాదనలకు కూడా ఆమోదం రాలేదని.. ఇలాంటి జాప్యంపై ప్రభుత్వంపై అపనమ్మకం ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు. దీనిపై కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ వివరణ కోసం ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.

మరిన్ని వార్తలు