మత్స్యకళాశాల అభివృద్ధికి రూ.3.63 కోట్లు

3 Oct, 2016 04:22 IST|Sakshi
మత్స్యకళాశాల అభివృద్ధికి రూ.3.63 కోట్లు
  • జనవరిలో రజతోత్సవాలు 
  •  
     ముత్తుకూరు : ముత్తుకూరులోని మత్స్యకళాశాల స్థాయి పెంచేందుకు శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నడుంకట్టింది. ఇందులో భాగంగా కళాశాల మొదటి అంతస్తు నిర్మాణానికి రూ.3.63 కోట్లు మంజూరు చేసింది. మొదటి విడతగా రూ.1.20 కోట్లు విడుదల చేసింది. అలాగే సంఖ్య పెరుగుతున్న విద్యార్థినుల హాస్టల్‌ మొదటి అంతస్తు నిర్మాణానికి రూ.1.50 కోట్లు మంజూరయ్యాయి. రూ.81 లక్షలతో నిర్మించిన మినీ ఆడిటోరియంను జనవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాణం పూర్తయిన ఈ ఆడిటోరియానికి అదనపు హంగులు సమకూర్చేందుకు రూ.45 లక్షలతో ప్రతిపాదనలు పంపారు. మరో వైపు వెంకటాచలం మండలంలోని తిరుమలమ్మపాళెంలో ఉన్న ఫామ్‌ చుట్టూ ప్రహరీగోడ నిర్మించేందుకు రూ.45 లక్షలు మంజూరైంది. ఎగువమిట్టలోని క్షేత్రంలో గిడ్డంగి నిర్మించేందుకు రూ.20 లక్షలు మంజూరు చేశారు. విద్యార్థుల మెస్, డైనింగ్‌ గది నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరైంది.
    ఇద్దరు డీన్‌లు రాక నేడు
    ఎస్‌వీవీయూ నుంచి సోమవారం మత్స్యకళాశాలకు ఇద్దరు డీన్‌లు వస్తున్నట్టు అసోసియేట్‌ డీన్‌ కృష్ణప్రసాద్‌ చెప్పారు. స్టూడెంట్‌ అఫైర్స్‌ డీన్‌ డాక్టర్‌ మూర్తి, ఫిషరీస్‌ డీన్‌ డాక్టర్‌ రమణ తదితరులు వస్తున్నారన్నారు. 2017 జనవరిలో కళాశాల రజతోత్సవ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందుకోసం కమిటీలు కూడా నియమించామన్నారు. 
     
     
     
>
మరిన్ని వార్తలు