‘విద్యార్థుల చేతుల్లో దేశ భవిష్యత్తు’

22 May, 2017 22:30 IST|Sakshi
‘విద్యార్థుల చేతుల్లో దేశ భవిష్యత్తు’

గుంతకల్లు రూరల్‌:  అవినీతి రాజకీయాలను పారదోలే శక్తి కలిగిన విద్యార్థుల చేతుల్లోనే  ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా స్థాయి శిక్షణ తరగతులను సోమవారం మండలంలోని బుగ్గ సంగమేశ్వరాల దేవాలయం ప్రాంగణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు పూర్తయిన కనీసం ఒక్కహామీని కూడా నెరవేర్చలేకపోయిందన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న కారణంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లు,  ప్రభుత్వ పాఠశాలలను మూతవేస్తూ విద్యను పేదలకు దూరం చేస్తోందన్నారు.   కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మధు, జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ మనోహర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జాన్సన్, జిల్లా మాజీ నాయకులు నారాయణస్వామి, స్థానిక నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు చిరంజీవి, పవన్‌కుమార్‌రెడ్డి, మురళిక్రిష్ణ, రాజశేఖర్, రాము రాయల్, ఎస్‌ఎండీ గౌస్‌,  సంఘం నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు