అమ్మాయిలకు క్రీడలతోనే భవిష్యత్తు

18 Aug, 2016 23:12 IST|Sakshi
అమ్మాయిలకు క్రీడలతోనే భవిష్యత్తు

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : అమ్మాయిలకు చదువుతోపాటు క్రీడలూ అవసరమని, తద్వారా బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంఛోఫెర్రర్‌ పిలుపునిచ్చారు. గురువారం అమ్మాయిలకు అనంత క్రీడాగ్రామంలో అమ్మాయిలకు అథ్లెటిక్స్‌ మీట్‌ను నిర్వహించారు. కార్యక్రమానికి మాంఛోఫెర్రర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రియో ఒలంపిక్స్‌లో సాక్షి మాలిక్‌ రెజ్లింగ్‌లో కాంస్య పతకం, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సింధు కూడా మంచి ప్రదర్శన చూపెడుతోందని, ఆమెకు పతకం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

దీపా జిమ్నాస్టిక్స్‌లో చూపిన ప్రతిభ అసమానమైనదన్నారు. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు చదువు, క్రీడల్లో రాణించేందుకు ఆర్డీటీ ఎనలేని కృషి చేస్తోందన్నారు. అమ్మాయిలకు హాకీ, ఫుట్‌బాల్, టెన్నిస్, సాఫ్ట్‌బాల్, క్రికెట్‌ అకాడమీలను ఏర్పాటు చే సినట్లు చెప్పారు. ప్రధానమంత్రి పిలుపునిచ్చిన ‘బేటీబచావో – బేటీ పడావో’ అనే నినాదాన్ని ఆయన తెలిపారు. స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ నిర్మల్‌కుమార్, యుగంధర్‌రెడ్డి, హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు