జిల్లా ఉద్యమం.. తీవ్రతరం

9 Sep, 2016 23:48 IST|Sakshi
గద్వాల న్యూటౌన్‌ : గద్వాల జిల్లా సాధనలో భాగంగా జేఏసీ ఉద్యమాన్ని తీవ్రతరం చేయనుంది. శుక్రవారం స్థానిక టీఎన్‌జీఓ భవనంలో నిర్వహించిన సమావేశంలో శనివారం నుంచి ఈ నెల 20 వరకు చేపట్టనున్న ఉద్యోగుల పెన్, ఉపాధ్యాయల చాక్‌డౌన్‌పై చర్చించారు. ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ఆయా సంఘాల బాధ్యులకు సూచించారు. ఆదివారం జూరాల ప్రాజెక్టుపై మన జిల్లా– మన ప్రాజెక్టు పేరుతో చేపట్టనున్న నిరసన కార్యక్రమం కరపత్రాలను విడుదల చేశారు. 12న స్థానిక తేరుమైదానంలో నిర్వహించే బహిరంగ సభకు ప్రొఫెసర్‌ కోదండరాం హాజరవుతారని, 15వ తేదీన టీపీఎఫ్‌ సీనియర్‌ నాయకుల ఆమరణ నిరాహార దీక్ష, 18న అఖిలపక్షం ఆధ్వర్యంలో గద్వాలలో ర్యాలీ, మహాసభ, 19 నుంచి మూడు రోజుల పాటు సకల జనుల సంపూర్ణ బంద్‌ చేపట్టనున్నారు. అనంతరం జేఏసీ నాయకులు వెంకట్రాములు, వీరభద్రప్ప మాట్లాడుతూ గద్వాల జిల్లా ఏర్పడితేనే ఈప్రాంత రైతాంగానికి మేలు చేకూరుతుందని చెప్పారు. సమావేశంలో జేఏసీ నాయకులు వెంకటరాజారెడ్డి, కృష్ణారెడ్డి, బాలగోపాల్‌రెడ్డి, ఆనంద్, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు