గద్వాల జిల్లా కాకపోతే నడిగడ్డ ఎడారే..

11 Sep, 2016 23:32 IST|Sakshi
ధరూరు : రాష్ట్రంలో జిల్లాల పునర్‌వ్యవస్తీకరణలో భాగంగా ఏర్పాటవుతన్న కొత్త జిల్లాల్లో గద్వాలను జిల్లా చేయాలంటూ చేస్తున్న ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఆదివారం ‘మన జిల్లా.. మన ప్రాజెక్టు’ పేరుతో జూరాల ప్రాజెక్టు వద్ద జేఏసీ పిలుపు మేరకు ఆల్‌ పార్టీ నాయకులు, విద్యార్ధి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక నాయకుల ఆధ్వర్యంలో మధ్యాహ్నం నిరసన ర్యాలీ చేపట్టారు. టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కష్ణమోహన్‌రెడ్డి, గద్వాల మున్సిపల్‌ చైర్మన్‌ పద్మావతి, జేఏసీ నాయకులు వీరభద్రప్ప, నాగర్‌దొడ్డి వెంకట్రాములు మాట్లాడుతూ వనపర్తి జిల్లా ఏర్పాటుతో గద్వాల ప్రాంతం పూర్తిగా ఎడారిగా మరిపోయే పరిస్థితి ఉందన్నారు. 400 క్యూసెక్కులు ఉన్న నీటి వాటాలో ఇప్పటికే తాగు, సాగు నీటి పేరుతో జూరాల ప్రాజెక్టు నుంచి 2వేల క్యూసెక్కుల నీటిని తరలించుకుపోతున్నారని ఆరోపించారు. నడిగడ్డ అభివద్ధిలో భాగంగా దివంగత ఎమ్మెల్యే పాగ పుల్లారెడ్డి ప్రాజెక్టును నిర్మించేందుకు పూనుకున్నారని, విభజనలో భాగంగా ఆ నీటిని సైతం వనపర్తికి తరలించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. తమ వాటా తమకు ఇవ్వడంతో పాటు గద్వాలను జిల్లా చేయాలని మరో మారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు అతికూర్‌రెహ్మాన్, వెంకట్రాజారెడ్డి, బీజాపూర్‌ ఆనంద్, మధుసూదన్‌బాబు, మున్నావర్‌పాష, రాజశేఖరరెడ్డి, పూజారి శ్రీధర్, గడ్డం కష్ణారెడ్డి, గంజిపేట రాములు  పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు