ముగిసిన గణపతి నవరాత్రోత్సవాలు

14 Sep, 2016 23:09 IST|Sakshi
ముగిసిన గణపతి నవరాత్రోత్సవాలు
శ్రీశైలం:  శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల సన్నిధిలో ఈ నెల 5న ప్రారంభమైన గణపతి నవరాత్రోత్సవాలు బుధవారం పూర్ణాహుతితో ముగిశాయి.  ముగింపు  పూజల్లో భాగంగా స్వామివార్ల రుద్రయాగశాలలో జయాదిహోమం, పూర్ణాహుతి, వసంతోత్సవం, అవబధోత్సవం, కలశోద్వాసన నిర్వహించారు. నారికేళాలు, సుగంధద్రవ్యాలు, ముత్యం, పగడం, బంగారం, వెండి, నూతనవస్త్రాలు తదితర ద్రవ్యాలను ఈఓ నారాయణ భరత్‌ గుప్త,జెఈఓ హరినాథ్‌రెడ్డి, అర్చకులు, వేదపంyì తులు హోమగుండానికి సమర్పించారు. అనంతరం యాగశాలలో నెలకొల్పబడిన పంచలోహ వరసిద్ధి వినాయకుడికి వ్రతకల్పపూర్వక ప్రత్యేకపూజలు చేశారు.ఆలయప్రాంగణంలోని మల్లికాగుండంలోఅభిషేకాది కార్యక్రమాలు నిర్వహించారు. తొమ్మిదిరోజులపాటు ఆగమ శాస్త్రానుసారం గణపతికి వేదపండితులు, అర్చకులు మండపారాధనలు, ఉపనిషత్తు పారాయణలు, జపానుష్టానాలు, హోమం, సాయంకాల పూజలు నిర్వహించినట్లు ఈఓ తెలిపారు. 
 
>
మరిన్ని వార్తలు