గాంధీజీ ఆశయాలను నెరవేర్చాలి

3 Oct, 2016 00:51 IST|Sakshi
జాతిపితకు నివాళులర్పిస్తున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత
ఖమ్మం జెడ్పీసెంటర్‌: ప్రపంచానికి ఆదర్శప్రాయుడైన గాంధీ ఆశయాలను నెరవేర్చేందుకు యువత కృషి చేయాలని కలెక్టర్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌ కోరారు. జాతిపిత 147వ జయంతి సందర్భంగా కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో ఆదివారం జరిగిన వేడుకలో పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. అహింసామార్గంలో మన దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన జాతి పిత స్ఫూర్తితో ప్రజలంతా ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో సమాచార శాఖ సహాయ సంచాలకుడు మహ్మద్‌ ముర్తుజా, సీసీ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
  • కలెక్టరేట్‌లో..
కలెక్టరేట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహానికి జాయింట్‌ కలెక్టర్‌ డి.దివ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీఆర్‌ఓ శ్రీనివాస్‌, ఏఓ మస్తాన్‌రావు, సూపరింటెండెంట్లు చంద్రశేఖర్‌, మదన్‌గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.
  • జిల్లాపరిషత్‌ కార్యాలయంలో..
జిల్లాపరిషత్‌కార్యాలయ ఆవరణలోని గాంధీజీ విగ్రహానికి జెడ్పీ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత, సీఈఓ మారపాక నగేష్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. డిప్యూటీ సీఈఓ కర్నాటి రాజేశ్వరి, ఏఓ భారతి, పీఆర్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నడింపల్లి వెంకటపతిరాజు, మల్లెల రవీంద్రప్రసాద్‌, సూపరింటెండెంట్లు రమణ, శారద, పద్మావతి, విజయలక్ష్మి, రామకృష్ణ, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
  • భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో...
భద్రాచలం : జాతి పిత గాంధీజీ చూపిన బాటలో అందరం నడుద్దామని, సమాజాభివృద్ధికి పాటుపడదామని ఐటీడీఏ పీఓ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. గాంధీ జయంతి వేడుక ఆదివారం ఐటీడీఏ కార్యాలయంలో జరిగింది. గాంధీజీ చిత్రపటానికి పీఓ రాజీవ్, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జయదేవ్‌, యూనిట్‌ అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజీవ్‌ మాట్లాడుతూ.. అహింసాయుధంతో ఆంగ్లేయులపై గాంధీజీ పోరాడారని అన్నారు. ఏపీఓ (జనరల్‌) భీమ్‌రావు, ఎస్‌డీసీ వెంకటేశ్వర్లు, ఏజెన్సీ డీఈఓ రవీందర్, ఏడీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పుల్లయ్య, ఈజీఎస్‌ ఏపీఓ బలరాం, ఏఓ తాతారావు తదితరులు పాల్గొన్నారు. 
  •  సమాచార శాఖ ఏడీ కార్యాలయంలో...
సమాచార శాఖ ఏడీ కార్యాలయంలో జరిగిన వేడుకలో ఏడీ ముర్తుజా, డిప్యూటీ ఈఈ సారయ్య, డీపీఆర్‌ఓ శ్రీనివాసరావు, ఏపీఆర్‌ఓలు యాకూబ్‌పాషా, ఉద్యోగులు రమేష్‌కుమార్‌, వల్లోజు శ్రీనివాస్‌, ఎస్‌.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు