రేపటి నుంచి గణపతి నవరాత్రోత్సవాలు

4 Sep, 2016 01:35 IST|Sakshi
రేపటి నుంచి గణపతి నవరాత్రోత్సవాలు
శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల సన్నిధిలో ఈ నెల 5వ తేదీ నుంచి 14 వరకు గణపతి నవరాత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. వినాయకచవితి సందర్భంగా  ఆలయప్రాంగణంలోని రత్నగర్భగణపతితో పాటు క్షేత్రపరిధిలోని సాక్షిగణపతికి విశేషపూజలను నిర్వహిస్తున్నట్లు ఈఓ నారాయణ భరత్‌ గుప్త శనివారం తెలిపారు.  అక్కమహాదేవి అలంకార మండపంలో వైదిక కమిటీ సూచనల మేరకు  మత్తికా గణపతి ( మట్టితో చేసిన వినాయక విగ్రహం) నెలకొల్పి విశేషపూజలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆగమశాస్త్రాన్ని అనుసరించి మండపారాధనలు, ఉపనిషత్‌ పారాయణలు, జపానుష్ఠానాలు, గణపతిహోమం, ఉపాంగహోమం, నిత్యాహవనాలు తదితర వైదిక కార్య›క్రమాలు జరుగుతాయన్నారు. గణపతి నవరాత్రోత్సవాలలో భక్తులు కూడా ఆర్జిత ఉభయం చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు ఈఓ నారాయణ భరత్‌ గుప్త  తెలిపారు.  ఒక్క రోజు ఉభయానికి  రూ. 5,000లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ ఉభయసేవా టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా కూడా పొందవచ్చునని పేర్కొన్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో పార్యావరణ పరిరక్షణ దష్టిలో పెట్టుకుని వినాయక చవితి మహోత్సవాలలో  వినాయకుని మట్టి విగ్రహాలను మాత్రమే అనుమతిస్తామని ఈఓ నారాయణభరత్‌ గుప్త శనివారం తలెఇపారు. పర్యావరణ సమతుల్యం కోసం క్షేత్రపరిధిలో ప్లాస్టర్‌ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాలను పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్నారు.   
 
మరిన్ని వార్తలు