గణేశ్‌ మండపాలకు అనుమతి తప్పనిసరి

17 Aug, 2016 22:47 IST|Sakshi
గణేశ్‌ మండపాలకు అనుమతి తప్పనిసరి

సాక్షి, సిటీబ్యూరో: గణేశ్‌ ఉత్సవాల నిర్వహణపై నగర పోలీసు కమిషనర్‌ ఎం.మహేందర్‌రెడ్డి దృష్టి కేంద్రీకరించారు. వచ్చే నెల 5 నుంచి ప్రారంభంకానున్న ఉత్సవాలు 15న జరిగే కీలక ఘట్టం నిమజ్జనంతో ముగుస్తాయి. నగరంలో మండపం ఏర్పాటు చేయాలంటే  పోలీసుల అనుమతి తప్పనిసరని కమిషనర్‌ స్పష్టం చేశారు. ఈ నెల 25 నుంచి 31 వరకు ప్రతి పోలీసుస్టేషన్‌లోనూ ఈ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని, పూర్తి చేసిన దరఖాస్తులను వచ్చే నెల ఒకటి లోపు తిరిగి సమర్పించాలని ఆయన కోరారు.

వుండపాల ఏర్పాటుకు అవసరమైన ఎన్‌ఓసీలు దరఖాస్తుకు జత చేయాలన్నారు. పోలీసులు పేర్కొనే ప్రమాణాల మేరకు మాత్రమే మండపాలు ఏర్పాటు చేయాలని, అందుకు భిన్నంగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇచ్చేదిలేదని స్పష్టం చేశారు.  మండపాల వద్ద బాక్సుటైప్‌ లౌడ్‌ స్పీకర్లను మాత్రమే పెట్టాలని, ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే వీటిని వాడాలని కొత్వాల్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు