తక్కువ ధరకు వజ్రం..

5 Dec, 2015 23:52 IST|Sakshi
తక్కువ ధరకు వజ్రం..

అయిజ: అసలే ఇది ఆఫర్ల కాలం. కస్టమర్లను ఆకట్టుకునే క్రమంలో వేలకొద్దీ కంపెనీలు లక్షల రకాల ఆఫర్లిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రూ. 50 లక్షల విలువైన వజ్రం రూ.15 లక్షలకే లభిస్తుందని ఓ వ్యాపారికి ఆఫర్ వచ్చింది. ఎంతో ఆశగా అడ్వాన్స్ సైతం చెల్లించిన ఆయన.. చివరికి ఎలా మోసపోయాడో మహబూబ్ నగర్ పోలీసులు వెల్లడించారు.

కర్నూలు జిల్లా డోన్ కు చెందిన బాబన్న రియల్టర్. గత అక్టోబర్ 20న బాబన్న డ్రైవర్ గా పనిచేస్తున్న తిరుపతికి ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. రూ. 50 లక్షల విలువైన వజ్రాన్ని అమ్మాలనుకుంటున్నట్లు, రూ. 15 లక్షలకైనాసరే ఇచ్చేస్తామని ఫోన్ సారాంశం. ఇదే విషయాన్ని డ్రైవర్ తిరుపతి.. బాబన్నకు చెప్పాడు. అదేరోజు డీల్ కుదుర్చుకునేందుకు ఐదుగురు వ్యక్తులు డోన్ కు వచ్చారు. మొదట 5 లక్షలు అడ్వాన్స్ చెల్లిస్తే, వజ్రం ఇచ్చేలా డీల్ కుదిరింది.

 

ఈ నెల 29న అడ్వాన్స్ మొత్తం అందుకున్న డైమండ్ గ్యాంగ్ పత్తాలేకుండా పారిపోయిన తర్వాతగానీ మోసపోయామని గ్రహించిన బాబన్న పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్ కు చెందిన ఆకాశింగ్, పాపింగ్, శోకింగ్, శాంచర్, కమతిసింగ్, పెనుకుమార్, కసాత్‌సింగ్ అనే ఏడుగురిని శనివారం గద్వాల రైల్వే స్టేషన్ లో అరెస్ట్ చేసినట్లు గద్వాల డీఎస్సీ బాలకోటి తెలిపారు.

మరిన్ని వార్తలు