ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం

24 Dec, 2015 12:07 IST|Sakshi

కరీంనగర్ : ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న మఠాగుట్టును కరీంనగర్ పోలీసులు రట్టు చేశారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ముఠాలోని మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 18 మంది నిరుద్యోగుల నుంచి దాదాపు రూ.70 లక్షలు వసూలు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు వివరించారు.
 

మరిన్ని వార్తలు