గంగాధర్ ఫొటోకు బంగారు పతకం

3 Feb, 2016 03:29 IST|Sakshi
గంగాధర్ ఫొటోకు బంగారు పతకం

 బాన్సువాడ టౌన్ : అంతర్జాతీయ స్థాయి ఫొటోగ్రాఫర్ల వర్క్‌షాపులో బాన్సువాడ మండలం దేశాయిపేట్ గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ గంగాధర్ యాదవ్‌కు బంగారు పతకం లభిం చింది.  గత నెల 29 నుంచి ఈ నెల 1 వరకు హైదరాబాద్‌లో అంతర్జాతీయ వర్క్‌షాపు నిర్వహిం చారు. ఈ ఫొటో ప్రదర్శనలో గంగాధర్ యాదవ్ దించిన ‘చారిక్రత కట్టడంలో చీపురుతో శుభ్రం చేస్తున్న మహిళ’ ఫొటోకు ప్రశంసలు అందాయి. గంగాధర్ యాదవ్‌కు డానీవాష్(మలేషియా), కావాలిన్(యూఎస్‌ఏ), ఫెడరేషన్ ఆఫ్ పోటోగ్రాఫర్ ఇండియా అధ్యక్షులు అనీల్ రిసాల్‌సింగ్, ఉపాధ్యక్షులు సుశాంత్‌బెనర్జీ తీర్థాదాస్ గుప్త పతకాన్ని అందించారు.
 

మరిన్ని వార్తలు