ట్యాంకర్‌లో గంజాయి తరలింపు

3 Apr, 2017 23:53 IST|Sakshi
  • 2,150.450 కిలోల స్వాధీనం
  • ముగ్గురి అరెస్ట్‌
  • పరారీలో ఇద్దరు నిందితులు
  • రాజమహేంద్రవరం రూరల్‌ : 
    ఎవరికి అనుమానం రాకుండా ట్యాంకర్‌లో గంజాయిని తరలించాలన్న వారి ఆశలు అడియాసలయ్యాయి. పోలీసులు తనిఖీల్లో ట్యాంకర్‌లో తరలిస్తున్న 2,150.450 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు అరెస్ట్‌ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని రాజమహేంద్రవరం అర్బ¯ŒS ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. బొమ్మూరు పోలీస్‌స్టేష¯ŒSలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
    ఆదివారం సాయంత్రం అందిన విశ్వసనీయ సమాచారంపై తూర్పు మండల డీఎస్పీ కె.రమేష్‌బాబు సూచనల మేరకు బొమ్మూరు పీఎస్‌ ఇ¯ŒSస్పెక్టర్‌ పి.కనకారావు, ఏజీఎస్‌ పార్టీ ఎస్సై శివాజీ, సిబ్బంది రాజానగరం మండలం దివా¯ŒSచెరువు గ్రామం గామ¯ŒS బ్రిడ్జి వద్ద హైవేపై వాహనాలు తనిఖీ చేశారు. ఆయిల్‌ ట్యాంకర్‌ను తనిఖీ చేస్తుండగా, అందులో 76 బస్తాల గంజాయి మూటలు బయటపడ్డాయి. వాటి విలువ విలువ రూ.1.10 కోట్లు ఉంటుంది. గంజాయి రవాణా చేస్తున్న విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంటకు చెందిన గుమ్మళ్ళ పైడిబాబు, లారీ డ్రైవర్‌ విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరుకు చెందిన కాశిరెడ్డి రహా నరసింహామూర్తి, లారీ క్లీనర్‌ జాన ప్రభులను రాజానగరం ఈఓపీఆర్డీ, వీఆర్వోల సమక్షంలో అరెస్ట్‌ చేశారు. గంజాయితో పాటు మూడు సెల్‌ఫోన్లు, రూ.2700 స్వాధీనం చేసుకున్నామన్నారు. 
    అనుమానం రాకుండా ట్యాంకర్‌లో..
    ఇటీవల గంజాయిని ట్రావెల్స్‌ వ్యాన్లు, ఇతర వాహనాల్లో తరలిస్తున్నారని, అయితే ఆయిల్‌ ట్యాంకర్‌లో తరలిస్తే అనుమానం రాదన్న ఉద్దేశంతో నిందితులు ఈ మార్గం ఎంచుకున్నట్టు అర్బ¯ŒS ఎస్పీ రాజకుమారి తెలిపారు. విశాఖ నుంచి మహారాష్ట్ర రాష్ట్రంలో సంగ్లీ పట్టణానికి చెందిన సమీర్‌కు ఈ గంజాయిని అప్పగించేందుకు తీసుకువెళుతుండగా పట్టుకున్నామన్నారు. గుమ్మళ్ళ పైడిబాబు, మణి గంజాయి రవాణా చేస్తున్నారన్నారు. గతంలో పైడిబాబుపై ఒక గంజాయి కేసు నమోదైందన్నారు. అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరుస్తామన్నారు. పైడిబాబు, భాగస్వామి మణితో పాటు మహారాష్ట్రకు చెందిన సమీర్‌ కోసం ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. గంజాయిని పట్టుకున్న పోలీసు అధికారులను అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమేష్‌బాబు, ఇ¯ŒSస్పెక్టర్‌ కనకారావు, ఎస్సైలు కిషోర్‌కుమార్, నాగబాబు పాల్గొన్నారు.
     
మరిన్ని వార్తలు