గ్యాస్‌ సిలిండర్‌ లీకేజీతో మంటలు

12 Dec, 2016 14:41 IST|Sakshi

రాయదుర్గం టౌన్‌ : పట్టణంలోని వరలక్ష్మీ వీధిలో బుధవారం నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో సిలిండర్‌ లీకై మంటలు చెలరేగి రూ.30వేల ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఫైర్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసి పరిస్థితిని అదుపు చేశారు. వివరాలిలా ఉన్నాయి. నాగరాజు భార్య మంజుల ఇండేన్‌ గ్యాస్‌ సిలిండర్‌ ఖాళీ కావడంతో మరో సిలిండర్‌ను మార్చే క్రమంలో రెగ్యులేటర్‌ను సక్రమంగా అమర్చకపోవడంతో వాచర్‌ నుంచి గ్యాస్‌ లీకైంది.

ఈ విషయాన్ని గమనించకుండా స్టౌవ్‌ వెలగించడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సమీపంలోని వంట సామాగ్రి, ఫ్రిజ్, ఫ్యాన్, ఇతర వస్తువులన్ని అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపకదళ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలు అదుపు చేశారు. 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు