గ్యాస్‌ లీకై రెండు ఇళ్లు దగ్ధం

26 Aug, 2016 21:59 IST|Sakshi
గ్యాస్‌ లీకై రెండు ఇళ్లు దగ్ధం
  •  రూ.30 లక్షల ఆస్తి నష్టం   
  •  దాచేపల్లి (గుంటూరు): గ్యాస్‌ సిలిండర్‌ లీకై రెండు ఇళ్లు దగ్ధమైన సంఘటన మండలంలోని కేసానుపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. నిమిషాల వ్యవధిలో మంటలు వ్యాపించటంతో ఇళ్లలో సామగ్రి  పూర్తిగా కాలిపోయింది. సుమారు రూ. 30 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన తాడేపల్లి సుబ్బారావు, అన్నపూర్ణ దంపతులు అద్దె ఇంట్లో నివాసముంటూ కిరాణ దుకాణం, హోటల్‌ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. పిల్లలకు అన్నం వండేందుకు అన్నపూర్ణ స్టౌ వెలిగించగా గ్యాస్‌ లీకై మంటలు వ్యాపించాయి. ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అదుపులోకి రాలేదు. మంటలు చెలరేగటంతో ఆమె శరీరం కాలింది. చుట్టు పక్కల వారు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా అగ్ని కీలలు భారీగా ఎగిసిపడ్డాయి. ఈ క్రమంలో సిలిండర్‌ పేలటంతో మంటలు ఉద్ధతి మరింతగా పెరిగాయి. సుబ్బారావు ఇంట్లో ఉన్న కిరాణదుకాణానికి సంబంధించిన సరుకులు, ఫ్రిజ్‌లు,, బీరువాలు, దుస్తులతో పాటు ఇతర సామగ్రి మొత్తం పూర్తిగా కాలిపోయాయి. ఇంటిపై కప్పు రేకులు కాలి నేలపై పడ్డాయి. మంటలు భారీగా ఎగిసిపడటంతో పక్కనే ఉన్న దేవరపల్లి సత్యం ఇంటికి కూడా అంటుకున్నాయి. సత్యం ఇంట్లోని సామాన్లు కాలిపోయాయి. అగ్నిప్రమాదం జరిగినట్లు స్థానికులు పిడుగురాళ్ల అగ్నిమాపక అధికారులు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలంకు చేరుకున్న ఫైర్‌ అధికారి చిరంజీవి, సాంబయ్య, వెంకటేశ్వర్లు మంటలను అదుపులోకి తెచ్చారు. 
     
మరిన్ని వార్తలు