దేవాదుల గేట్ వాల్వును విప్పిన రైతులు

31 Aug, 2015 01:10 IST|Sakshi
దేవాదుల గేట్ వాల్వును విప్పిన రైతులు

-గ్రామ చెరువులు నింపుకునేందుకు యత్నం
స్టేషన్‌ఘన్‌పూర్: వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని చిల్పూరు- మల్కాపూర్ గ్రామాల మధ్య నుంచి వెళ్తున్న రెండో దశ పైప్‌లైన్ గేట్ వాల్వును ఆదివారం రైతులు విప్పి.. చెరువులు నింపుకున్నారు. దేవాదుల పైప్‌లైన్ ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి మల్లగండికి అధికారులు నీటిని పంపిస్తున్నారు. అయితే, వర్షాభావంతో నీళ్లు లేక పంటలు ఎండిపోవడంతో పాటు మూగ జీవాలు సైతం నీళ్లులేక అల్లాడుతుండడంతో చూడలేక ఆదివారం మల్కాపూర్, వెంకటాద్రిపేట, చిల్పూరు రైతులు సమావేశమయ్యారు.

చిల్పూరు-మల్కాపూర్ గ్రామాల మద్య ఉన్న గేట్ వాల్వును విప్పితే సమభాగంగా మూడు గ్రామాల్లోని చెరువుల్లోకి నీరు చేరుతుందని దీంతో మూగ జీవాలను కాపాడుకోవ చ్చని నిర్ణయించుకున్నారు. ఆదిఆవరం రాత్రి సమయంలో గేట్‌వాల్వును విప్పడంతో ఒక్కసారిగా నీరు ఎగజిమ్మింది. నీరు చెరువుల్లోకి చేరుతోంది. అయితే, తాము ఒకరి కోసం ఈపని చేయలేదని కనీసం మూగ జీవాలకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈపని చేశామన్నారు. గేట్‌వాల్యూ విప్పిన విషయం అదివారం రాత్రి పొద్దుపోయేంత వరకు అధికారుల దృష్టికి రాలేదని సమాచారం.

మరిన్ని వార్తలు