శ్రీగౌతమి హత్య కేసులో వీడుతున్న చిక్కుముడులు

24 Jan, 2017 11:48 IST|Sakshi
హత్య కేసులో వీడుతున్న చిక్కుముడులు
 • ‘సాక్షి’ కథనంతో కదలిక
 • బయటపడ్డ గౌతమి, బుజ్జి పెళ్లి నాటి ఫొటోలు

 • సాక్షి నరసాపురం: రోడ్డు ప్రమాదం పేరుతో శ్రీగౌతమిని హత్య చేశారనే విషయం రూఢి అయింది. తమను నలుగురైదుగురు కారులో వెంబడించి మరీ ఢీకొట్టారని శ్రీగౌతమి సోదరి పావని చెబుతోంది. సజ్జా బుజ్జి భార్య శిరీష, ఆమె కారు డ్రైవర్‌ రాంబాబు కలసి హత్య చేయించారని రోదిస్తోంది. శ్రీగౌతమి,  బుజ్జి రహస్య వివాహానికి చెందిన ఫొటోలు బయటకు వచ్చాయి. 2016 జనవరిలో బుజ్జి అన్నవరంలో శ్రీగౌతమిని వివాహం చేసుకున్నాడు. అయినా పోలీసులు మాత్రం మీన మేషాలు లెక్కిస్తున్నారు.

  చదవండి...(ఐఏఎస్ కావాల్సిన యువతి...)

  కేసు మాఫీకి ఎమ్మెల్యే ప్రయత్నం!
  టీడీపీ నేత సజ్జా బుజ్జి టీడీపీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తుంటాడనే పేరుంది. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామా నాయుడు కేసును పక్కదోవ పట్టించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నట్టు ప్రచారం జరుగు తోంది. జిల్లాలోని మరో టీడీపీ ఎమ్మెల్యే సైతం కేసును నీరుగార్చేందుకు రాష్ట్ర స్థాయిలో కృషి చేస్తున్నారని చెబుతున్నారు.

  రోడ్డెక్కిన విద్యార్థి, మహిళా సంఘాలు
  ఈ కేసుతో సంబంధం ఉన్న సజ్జా బుజ్జి, అతని భార్యను శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ  ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా నాయకులు నరసాపురం అంబేడ్కర్‌ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహిం చారు. కాపు సంఘం ముఖ్య నేతలు సమావేశమై ఘటనను ఖండించారు. దీంతో బుజ్జి కుటుంబీకులు అజ్ఞాతంలోకి వెళ్లారు.

  పోలీసుల అదుపులో కారు డ్రైవర్‌
  కేసు పురోగతిపై పాలకొల్లు సీఐ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా కారు డ్రైవర్‌ కడియాల ప్రసాద్‌ (24)తోపాటు కారు యజమానిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు.కాగా సోమవారం ఉదయం వైజాగ్‌ నుంచి కారు డ్రైవర్‌ను తీసుకువచ్చి ఎస్పీ వద్దకు తీసుకు వెళ్లినట్టు సమాచారం.