గవిమఠం బ్రహ్మోత్సవాలు ప్రారంభం

2 Mar, 2017 22:37 IST|Sakshi

ఉరవకొండ : ఉరవకొండ గవిమఠ స్థిత చంద్రమౌళీశ్వరస్వామి వారి బ్రహోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. స్వామి వారికి అభిషేకం, మహామంగళహారతి, కుంకుమార్చన నిర్వహించారు. ఆదోని చౌకిమఠం పీఠాధిపతి కళ్యాణస్వామి, మఠం సహాయ కమిషనర్‌ ఆనంద్‌ అధ్వర్యంలో గంగాజలంతో ఊరేగింపుగా కంకణ మండపానికి చేరుకున్నారు. అనంతరం పూజలు చేశారు. మఠం సిబ్బంది నారాయణస్వామి, గోపీ పాల్గొన్నారు. బ్రహోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారి నాగాభరణ ఉత్సవం జరగనుంది. 

మరిన్ని వార్తలు